కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీ

కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపి జీ కిషన్ రెడ్డిని టీఆర్ఎస్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్ర పర్యాటక మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో.. జీ కిషన్ రెడ్డిని ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి కలిశారు. ఈ సందర్బంగా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కార్యక్రమాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఎంపీ రంజిత్ రెడ్డి చర్చించారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అంశాల పై కృషి చేయాలని కేంద్రమంత్రిని ఎంపీ రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర తరఫున కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కావడం చాలా హర్షించ దగ్గ విషయం అని వెల్లడించారు. కాగా ఇటీవలే జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కిషన్ రెడ్డికి చోటు దక్కిన విషయం తెలిసిందే.