అమిత్ షాను తొల‌గించాల్సిందే : ట్యాపింగ్ పై రేవంత్ సంచలనం

-

ట్యాపింగ్ వ్యవహారంపై మారోసారి తెలంగాణ టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెగాస‌స్ వ్య‌వ‌హారంలో ప్రధాని మోడీ, సిఎం కేసీఆర్ ఇద్దరు తోడు దొంగ‌లేనని నిప్పులు చెరిగారు. రాజ్ భ‌వ‌న్ ముట్ట‌డి సంద‌ర్భంగా పోలీసులు వ్య‌వ‌హరించినా తీరు తీవ్ర ఆక్షేప‌నీయమని.. తెలంగాణ సర్కార్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.


మోడీ, కేసీఆర్ ఒకే ఒకే గూటి ప‌క్షుల‌ని ఈ ఘ‌ట‌న‌తో మ‌రోసారి రుజువైందన్నారు రేవంత్ రెడ్డి. సిఎం కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్‌లో ఆరితేరిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. న్యాయ విచార‌ణ పూర్తి అయ్యేవ‌ర‌కు హోం మంత్రి అమిత్ షాను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించాలని డిమాండ్ చేశారు.

పెగాస‌స్ వ్య‌వ‌హారంలో ప్ర‌ధాని కార్యాల‌యం పాత్ర‌పై విచార‌ణ చేయాలని పేర్కొన్నారు. పెగాస‌స్ వ్యవ‌హారంలో దోషులు బ‌య‌ట ప‌డే వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ ప‌క్షాన పోరాటాలు కొన‌సాగిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చేది కాంగ్రెస్స్ ప్రభుత్వమే అని ధీమా వ్యాఖ్యమ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news