టీపీసీసీ ఛీఫ్ గా రేవంత్ రెడ్డి..! నేడు ప్రకటన !

-

తెలంగాణ పిసిసి పదవిపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అసలు అధిష్టానం పిసిసి పదవిని నియమిస్తుందా లేదా అనే సందేహాలు కూడా కొందరు నాయకులలో వచ్చాయి. అటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్ష పదవి నాకంటే నాకు అని పోటీ పడుతున్నారు. రెడ్డిలకు ఇవ్వాలని కొందరు అంటుంటే.. కాదు, కాదు బీసీలే కరెక్ట్ అంటూ మరికొందరు నాయకులు అధిష్టానం ముందు తమ, తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. అయితే ఈ పీసీసీ పదవి ఎంపికకు కౌంట్ డౌన్ మొదలైనట్టే కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకంపై ఇవాళ మరోసారి కీలక భేటీ నిర్వహించనుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ భేటీ నేపథ్యంలోనే నిన్న రాత్రి హుటాహుటిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు.


అయితే.. టీపీసీసీ చీఫ్ బాధ్యతలు కోమటి రెడ్డి అప్పగించాలని కొన్ని రోజులుగా పార్టీ సీనియర్లు ఇప్పటికే అధిష్టానం ముందు తెలిపారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం కోమటి రెడ్డిని పక్కకు పెట్టి ఎంపీ రేవంత్‌ రెడ్డికే మొగ్గు చూపినట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే అధిష్టానం నిర్ణయం తీసుకుందని.. ఇవాళే ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని విశ్వశనీయ వర్గాల సమాచారం. అటు కోమటిరెడ్డిని బుజ్జగించడానికే కాంగ్రెస్‌ అధిష్టానం ఢిల్లీకి రమ్మన్నట్టు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news