మరో రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అదిలాబాద్ ఎంపీ సీటును బాబురావుకు కాకుండ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నగేశ్ కు ఇచ్చింది.
దీంతో సోయం బాబురావు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలో బాబురావు బీజేపీ నుంచి కాంగ్రస్లో చేరే ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లకుండా ఎంపీ సోయంను బీజేపి పెద్దలు బుజ్జగిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంపీ, బీజేపీ లీడర్సోయం బాబురావుకు జాతీయ స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ ను బీజేపీ హైకమాండ్ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి ఢిల్లీకి బాబు రావు వెళ్లనున్నారు. బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ , నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ లను సోయం బాబు రావుకు కల్పిస్తానని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నగేశ్ కు సహకరించాలని సోయం బాబూరావు కి బీజేపీ పెద్దలు సూచించారు. దీంతో పార్టీ మారే ఆలోచనను సోయం విరమించుకున్నట్లు సమాచారం
.