విజయసాయి ట్వీట్.. బాబు తల ఎక్కడ పెట్టుకోవాలో..?

-

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిరేపిన హూజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజారిటీ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడ టీడీపీ, బీజేపీలకు కనీసం డిపాజిట్లు రాలేదు. తెలుగు దేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కేవలం 1800 ఓట్లు మాత్రమే వచ్చాయి.

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా వెటకారం ఆడారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న 2.20 లక్షల మంది ఓటర్లలో 1800 మంది తిరిగి చంద్రబాబు అధికారంలోకి రావాలని కోరుకుంటున్న మాట నిజమేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

పోలైన ఓట్లలో ఒక్క శాతం కూడా రాని పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడంటూ సెటైర్ వేశారు. మళ్లీ తానే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు చంద్రబాబు కలవరిస్తున్నారన్నారు. ‘ఎయిర్ పోర్టులో చిరు తిండ్ల ఖర్చు 25 లక్షలు, ఒక్క రోజు ధర్నాకు 10 కోట్లు… ఇలా చెప్పుకుంటే పోతే జాబితా చాలా పెద్దది వస్తుందన్నారు. కొందరు పదవిలో ఉన్నది అనుభవించడానికే అనుకుంటారు.

ఇసుక కొరత అని ఆందోళనకు దిగుతున్న పచ్చ పార్టీ, బానిస పార్టీలు కోరుకునేదేమిటంటే… వర్షాలు కురవొద్దు. నదులు, వాగులు ఉప్పొంగకూడదు. రిజర్వాయర్లు నిండొద్దు. నదులన్నీ ఎండిపోయి ఇసుక రాశులు తేలి ఉంటే ఏ కొరతా ఉండదు. ఇటువంటి తిరోగమన ఆలోచనలున్న వాళ్లు భూమికి భారం కాక మరేమిటి? అని ట్విట్టర్‌లో స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news