సూపర్ ఆఫర్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్.. సూర్య సినిమాలో ఛాన్స్

-

‘సీతారామం’  సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఈ మూవీలో సీతగా నటించి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి మదిలో చిరకాల ముద్ర వేసింది. ఈ భామ నటన, అందానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్​కు టాలీవుడ్​లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మృణాల్.. తాజాగా మరో సూపర్ ఆఫర్ దక్కించుకుంది.

తెలుగులో సత్తా చాటిన మృణాల్​ ఇప్పుడు తమిళ చిత్రసీమ నుంచి పిలుపు అందుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. దిశా పటానీ కథానాయిక. చారిత్రక కథాంశంతో ఓ భారీ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో మృణాల్‌ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని సమాచారం.

ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్‌ నచ్చడంతో మృణాల్‌ అంగీకారం తెలిపిందని తెలిసింది. ఫిబ్రవరిలో ఆరంభం కానున్న కొత్త షెడ్యూల్‌లో ఆమె సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సూర్య పలు భిన్నమైన రూపాల్లో కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. వెట్రి ఛాయాగ్రాహకుడు.

Read more RELATED
Recommended to you

Latest news