IPL 2023 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఓ పక్క ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటైయిన్, రిలీజ్, ట్రేడింగ్, మినీ వేలం కోసం సన్నాహకాల్లో బిజీగా ఉంటే, విదేశీ స్టార్లు ఒక్కొక్కరుగా లీగ్ నుంచి జారుకుంటున్నారు. ఈ తరుణంలో ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది.
గత ఐపిఎల్ సీజన్ లో కెప్టెన్ గా నియాకమై, అనంతరం మళ్లీ ధోనీకే నాయకత్వ పగ్గాలను వదిలేసిన రవీంద్ర జడేజాను కూడా చెన్నై రిలీజ్ చేస్తుందని భావించగా, అతనిని వదులుకోబోమని ముందే సీఎస్కే సంకేతాలు ఇచ్చింది. అన్నట్టుగానే అతన్ని రిటైన్ చేసుకుంది.
అతడితో పాటు కెప్టెన్ ధోని, తెలుగు క్రికెటర్ అంబటి రాంబాబు, రుతురాజు గైక్వాడ్ మోయిన్ అలీ, దీపక్ చాహర్, మిచెల్ శాంటర్న్, శివమ్ దుబే, డెవాన్ కాన్వె, డేయిన్ పెట్రోరియస్, మహేష్ థిక్షణ, ప్రశాంత్ సోలంకి, ముఖేష్ చౌదరి, సిమ్రాజిత్ సింగ్, తుషార్ దేశ్ పాండే, రాజ్ వర్ధన్ హంగర్ గేకర్, మతిషా పతిరణ, శుభర్షన్ సేనాపతిని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది.