నేడు జరిగిన రిలయన్స్ వార్షికోత్సవ సమావేశంలో వచ్చే సంవత్సరం నుండి 5G సేవలను ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఓ సంస్థ అతి త్వరలో 5G స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.
ప్రస్తుతం భారతదేశంలో చాలా వరకు ఫీచర్ ఫోన్ యూజర్లు ఉన్నారని, వారందరికీ తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ అందించే విధంగా గూగుల్ సంస్థతో కలిసి 4G లేదా 5G స్మార్ట్ ఫోన్ ను తయారు చేయబోతున్నట్లు తెలిపారు. రాబోయే స్మార్ట్ ఫోన్ ను అందరికీ అందుబాటులో ఉండే మార్కెట్ ధర ప్రకారం తయారు చేయబోతున్నామని, ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ను గూగుల్ సంస్థ తో కలిపి తయారు చేయబోతున్నట్లు ముకేశ్ అంబానీ తెలియజేశారు. గూగుల్ – జియో బంధం భారతీయులకు 2జి నుండి విముక్తి కల్పించిందని, అయితే దేశంలో ఇప్పటికి సుమారు 35 కోట్ల మంది 2g ఫోన్ ను వాడుతున్నారని తెలిపారు. మొత్తానికి దేశ ప్రజలకి వివిధ రేంజ్ లలో సరసమైన ధరలకు ఫోన్లను అందించబోతుంది.