ముస్లీం యాత్రికులకు శుభవార్త… 2022 హజ్ యాత్రకు ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభం

-

హజ్ సందర్శించాలనుకుంటున్న ముస్లీంలకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022 హజ్ యాత్ర కోసం వెళ్లేవారి కోసం సోమవారం నుంచి ఆన్లైన్ అప్లికేషన్లను తీసుకోవడం ప్రారంభించింది. ముంబై లోని హజ్ హౌజ్ లో మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రారంభించారు. ఈసారి హజ్ యాత్ర అప్లికేషన్ ప్రక్రియ వంద శాతం ఆన్లైన్ లోనే ఉంటుందని మంత్రి వెల్లడించారు. హజ్ మొబైల్ యాప్ ద్వారా కూడా అప్లికేషన్ ప్రక్రియ పూర్త చేయవచ్చని ఆయన వెల్లడించారు. హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోవడానికి 2022 జనవరి 31 చివరి తేది అని తెలిపారు.

ఈ సారి హజ్ యాత్రికులు ’లోకల్ ఫర్ ఓకల్ ‘ నినాదంతో పూర్తిగా స్వదేశీ వస్తువులతో అక్కడకు వెళ్తారని నఖ్వీ వెల్లడించారు. సాధారణంగా హజ్ యాత్రకు వెళ్లే వారు గొడుగు, దుప్పటి, డిండు, టవల్ వంటివి సౌదీ అరేబియాలో కొనుగోలు చేస్తారని అయితే ఈసారి స్వదేశం నుంచే వీటి తక్కువ ధరకే యాత్రికులు తీసుకెళ్తారని తెలిపారు. సౌదీ అరేబియాలో ధర కన్నా 50 శాతం తక్కువకే వీటిని యాత్రికులకు అందిస్తామన్నారు. వీటిని యాత్ర ప్రారంభ ప్రదేశాలలో యాత్రికులకు ఇస్తారని తెలిపారు. ఏటా 2 లక్షల మంది భారతీయులు హజ్ యాత్రకు వెళుతారు. 2022 హజ్ యాత్ర ప్రారంభ స్థలాలను 21 నుంచి 10 కి తగ్గించినట్లు వెల్లడించారు. ముంబై, కోల్ కతా, హైదరాబాద్, బెంగళూర్, అహ్మదాబాద్, కొచ్చిన్, గౌహతి, లక్నో, శ్రీనగర్ నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news