అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయనను లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. అయితే ములాయం సింగ్ యాదవ్‌కు కడుపు నొప్పి వచ్చింది.. దీంతో ఆయన సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదు అని మేదాంత ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కపూర్ చెప్పారు.
అలాగే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కపూర్ తెలియజేశారు. ములాయంను చేర్చిన ఆస్పత్రిని ఆయన కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్ సందర్శించారు. అయితే గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ములాయం తరచూ ఆస్పత్రికి వెళ్లొస్తున్నారు. చివరిసారిగా ఆయన మే నెలలో కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరి, రెండ్రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.