వివాదాస్పద తీర్పులు.. న్యాయమూర్తికి సుప్రీం షాక్ !

-

న్యూఢిల్లీ : చిన్నారుల‌పై లైంగిక వేధింపులు , దాడుల‌కు సంబంధించిన ప‌లు కేసుల్లో వివాదాస్పద తీర్పులు వెలువ‌రించిన బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ మ‌హిళా న్యాయ‌మూర్తి జ‌స్టిస్ పుష్ప వీరేంద్ర గ‌నేడి వాలాకు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం షాక్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. హైకోర్టులో ఆమెకు శాశ్వ‌త హోదా క‌ల్పించేలా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసును వెన‌క్కి తీసుకున్న‌ట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా త‌న క‌థ‌నంలో పేర్కొంది.

ఇటీవ‌ల న్యాయ‌మూర్తి గ‌నేడివాలా ఇచ్చిన ప‌లు తీర్పులు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ఆమెను శాశ్వ‌త న్యాయ‌మూర్తి హోదా క‌ల్పించ‌డానికి జ‌న‌వ‌రి 20న అత్యున్న‌త న్యాయ‌స్థానం కొలీజియం ప్ర‌తిపాద‌న‌లు చేసింది. అయితే, తాజాగా దానిని ఉప‌సంహ‌రించుకున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల 12 ఏండ్ల బాలిక‌పై లైంగిక వేధింపుల‌కు సంబంధించిన కేసులో స్కిన్ టూ స్కిన్ కాంటాక్టు లేనందున దానిని లైంగిక వేధింపుల కింద ప‌రిగ‌ణించ‌లేమ‌ని తీర్పును ఇచ్చారు. అలాగే, ఐదేండ్ల బాలిక‌పై లైంగిక వేధింపుల కేసు విచార‌ణ సంద‌ర్భంగా మైన‌ర్ బాలిక ముందు పురుషుడు ప్యాంట్ జిప్ విప్ప‌డం, చేతులు ప‌ట్టుకోవ‌డం లైంగిక వేధింపుల కింద‌కు (పోక్సో చ‌ట్టం) రాద‌ని వ్యాఖ్యానించారు.

ఈ తీర్పుల ప‌ట్ల ప్ర‌జా ఆగ్ర‌హం ఉవ్వెత్తున ఎగిసి, తీవ్ర దుమారం రేపాయి. ఈ నేప‌థ్యంలోనే న్యాయ‌మూర్తి గ‌నేడివాలా ఇచ్చిన తీర్పుల‌ను అలార్నీ జ‌న‌ర‌ల్ కెకె. వేణుగోపాల్ అత్యున్న‌త న్యాస్థానం దృష్టికి తీసుకెళ్ల‌గా.. ఆ తీర్పుల‌పై సుప్రీం స్టే విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news