అంబానీ ఇంటి బయట కారు బాంబు కేసు..కీలక పోలీసు అధికారి అరెస్ట్ !

-

గత నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఉంచడంలో మహారాష్ట్ర అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజ్ పాత్ర ఉందని గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆయనని అరెస్ట్ చేసింది. రాష్ట్ర రాజధానిలోని ఎన్ఐఏ కార్యాలయంలో కొన్ని గంటల పాటు ఆయనని ప్రశ్నించిన అనంతరం నిన్న అర్ధరాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో రెండు సంబంధిత కేసులకు సంబంధించి మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) కస్టడీకి వాజ్ ని అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 25న అంబానీ నివాసం యాంటిలియా వద్ద జిలిటెన్‌ స్టిక్స్‌తో ఉన్న వాహనం కలకలం రేపింది. 

ఈ కేసులో ఆటో విడిభాగాల వ్యాపారి వాహన యజమాని  మన్సుఖ్ హిరేన్ ఈ నెల 5న అనుమానాస్పద స్థితిలో థానేలో మృతి చెందారు. దీంతో హిరేన్‌ భార్య ఫిర్యాదు మేరకు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ సచిన్‌ వాజేపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో మహారాష్ట్ర మాజీ  సీఎం, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవీస్‌ కూడా వాజేపాత్రపై పలు అనుమానం వ్యక్తం చేశారు.  ఆటో పార్ట్స్ డీలర్ ఫిబ్రవరి 17 న రిపోర్ట్ చేసిన వాహనం దొంగతనానికి సంబంధించినదని అంటున్నారు. ఫిబ్రవరి 5 న తిరిగి ఇస్తానని చెప్పి ఆ అధికారి నాలుగు నెలల పాటు ఎస్‌యూవీని అరువుగా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హిరాన్ భార్య తన భర్త మరణంలో సచిన్‌ వాజే ప్రమేయం ఉందని ఆరోపించారు. 

Read more RELATED
Recommended to you

Latest news