ఈ సీజన్‌లోనే పటిష్టమైన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ సండే పోరుకు సై అంటున్నాయ్. ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విక్టరీ కొట్టి ఢిల్లీ టాప్ ప్లేస్‌లో ఉంది. అదే ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో బంపర్ విక్టరీలు కొట్టిన ముంబై సెకండ్ ప్లేస్‌లో ఉంది.సూపర్ సండే డబుల్ ధమాకాలో కాసేపట్లో అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. టేబుల్ టాప్ ప్లేస్ కోసం ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయ్. ఈ సీజన్‌లో బెస్ట్ టీమ్స్ ఫైట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో దూకుడు మీదున్న ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయడం.. ఆ తర్వాత ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేయడం అనే వ్యూహంతో విజయాలు సాధిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ముంబై ఇండియన్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్ ఆడిన ఆరు మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ఆ జట్టు గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేన భారీ తేడాతో ప్రత్యర్థులను ఓడించింది.
మరోవైపు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. ఈ సీజన్ సాగే కొద్దీ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లతో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న క్యాపిటల్స్ లీగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఓవరాల్‌గా ఆరు మ్యాచ్‌లాడిన ఢిల్లీ ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గింది. కేవలం ఒకే ఒక్క పోటీలో ఓడిపోయింది.
గత మ్యాచ్‌ల పోరాటల్లో కూడా ఈ రెండు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయ్. ఈ రెండు జట్లు 24 మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరో 12 మ్యాచ్‌ల్లో విక్టరీ కొట్టాయ్. మ్యాచ్ జరిగే అబుదాబి బ్యాటింగ్ అనుకూలించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన టీమ్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.