మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు… తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ముంబై మహానగరంలో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరుణ కేసుల నేపథ్యంలో పాఠశాలను జనవరి 31 వ తేదీ వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మున్సిపల్ కార్పొరేషన్.
ఒకటి నుంచి 9వ తరగతి లకు మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అలాగే పదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు కొనసాగుతాయని పేర్కొంది ముంబై మున్సిపల్ కార్పొరేషన్. అయితే కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ క్లాసులను నిర్వహించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా మహారాష్ట్ర లో గడచిన 24 గంటల్లో 11887 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే నిన్న ఒక్క రోజే 9 మంది ఈ వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 42 వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.