ACHARYA : ఆచార్య నుంచి ” శానా కష్టం” సాంగ్ రిలీజ్..స్టెప్పులు ఇరగదీసిన మెగాస్టార్

-

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న తాజా మూవీ ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… మరో జంటగా రామ్ చరణ్ అలాగే పూజా హెగ్డే నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. “షానా కష్టం” అంటూ సాగే ఈ మాస్‌ సాంగ్‌ ప్రోమో ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ పాటలో టాలీవుడ్ హీరోయిన్ రెజినా, మెగాస్టార్ ఆర్ చిరంజీవి తో స్టెప్పులేసింది. అటు ఏజ్ మీద పడినప్పటికీ మెగాస్టార్ తన స్టెప్పులతో అదరగొట్టాడు. మొత్తానికి ఈ సాంగ్ మెగా ఫాన్స్ ను అలరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news