ప్రముఖ కమెడీయన్ మునావర్ ఫరూఖీ షో రద్దు అయింది. జనవరి 9 వ తేదీన హైదరాబాద్ లో మునావర్ ఫరూఖీ షో నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. ఈ షో కు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే.. తెలంగాన రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
దీంతో కరోనా ఆంక్షలను అమలు చేస్తోంది కేసీఆర్ సర్కార్. దీంతో జనవరి 9 వ తేదీన హైదరాబాద్ లో జరగాల్సిన మునావర్ ఫరూఖీ షో రద్దు అయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు నిర్వహకులు. ఇది ఇలా ఉండగా… కమెడీయన్ మునావర్ ఫరూఖీ షో… తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడాన్ని… మొదటి నుంచి బీజేపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ షోను రద్దు చేయాలంటూ.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే.. తెలంగాణ డీజీపీ మహేందర్ కు లేఖ కూడా రాశారు. అయితే.. తాజాగా కరోనా కారణంగా ఈ షో రద్దు అయింది.