అక్కడ మళ్ళీ రీపోలింగ్.. ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచనలు !

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రోజు కో మలుపు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికలలో పోటీ చేసిన ఒక అభ్యర్ధికి సంబంధించిన ముద్ర తప్పు పడడంతో ఈరోజు మలక్పేట డివిజన్లో రీపోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే మరో రెండు చోట్ల రీ పోలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల కమీషన్ కి తెలంగాణ హైకోర్టు సూచించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఘాన్సీ బజార్ లో రీ పోలింగ్ నిర్వహించాలని, అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు.

అలానే బీజేపీ తరపున ప్రతినిధులు ఇప్పటికే ఈ రెండు డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్ మెట్లు ఎక్కారు. ఆ రెండు చోట్ల ఓటింగ్ లో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ బీజేపీ ప్రతినిధులు ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించి వినతి పత్రం అందజేశారు. ఇక హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఈ కాపీని తీసుకువెళ్లి బీజేపీ నేతలు రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డి తదితరులు మరోసారి ఆక్షన్ కమిషన్ ను కోరారు. 

Read more RELATED
Recommended to you

Latest news