హిందూ దేవాలయానికి భూమి దానం ఇచ్చిన ముస్లిం

-

భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి ఉంటారు. కానీ రాజకీయ నాయకులు తమ రాజకీయాల కోసం వారిద్దరి మధ్య తగవులు పెట్టాలని చూస్తూ ఉంటారు. అయితే అలాంటివేవీ తమ ముందు పనికిరాని చాలా సార్లు హిందూ ముస్లిం సోదరులు చాటి చెప్పుకున్నారు. తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. జాతీయ వార్తా సంస్థ కథనం ప్రకారం ఓ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి హనుమాన్ ఆలయం నిర్మాణానికి తన భూమిని విరాళంగా ఇచ్చి హిందూ ముస్లిం భాయీభాయీ అనే పదాన్ని నిజం చేశారు.

వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని కడుగోడి  గ్రామానికి చెందిన భాషాకు గ్రామంలోని హనుమాన్ ఆలయం పక్కనే ఒక భూమి ఉంది. అయితే హనుమాన్ ఆలయానికి వస్తున్న భక్తులు ఆలయం చిన్నది కావడంతో అనేక ఇబ్బందులు పడుతూ ఆయనను దర్శించుకుంటున్నారు. కొన్నాళ్లుగా దాన్ని చూసి బాధ పడుతున్న భాషా ఆలయాన్ని పెద్దది చేసి కట్టడానికి గాను తన స్థలాన్ని విరాళంగా అందజేశారు. ఇక ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ హనుమాన్ ఆలయం నిర్మాణానికి భాషా మనస్ఫూర్తిగా తన భూమిని విరాళంగా ఇచ్చారు అని త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఒక ముస్లిం హనుమాన్ దేవాలయానికి భూమిని విరాళంగా ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. .

Read more RELATED
Recommended to you

Latest news