క్రెడిట్ కార్డు క్లోజ్ చెయ్యాలంటే… తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

-

క్రెడిట్ కార్డులను ఈ మధ్య ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. బ్యాంకులు కూడా మంచి ఆఫర్లతో క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డుని ఉపయోగించడం బాగుంటుంది కానీ బిల్ కట్టేటప్పుడు కష్టమే. అయితే వివిధ సమస్యల వలన కార్డుని క్లోజ్ చెయ్యాలని చాలా మంది భవిస్తూ వుంటారు. ఆ ప్రాసెస్ గురించి మనం ఇప్పుడు చూద్దాం.

కార్డు జారీ చేసిన బ్యాంకు లేదా నాన్ ఫైనాన్స్ బ్యాంకు క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్‌ నెంబర్ కి డయల్ చేసి క్యాన్సిల్ చెయ్యమని చెప్పవచ్చు.
ఇష్యూయర్‌కు రిట్టెన్ రిక్వెస్ట్ పెట్టి మీరు మీ కార్డు ని క్యాన్సల్ చేసుకోవచ్చు.
దీని కోసం మీరు మెయిల్ ద్వారా కూడా అప్లికేషన్ పెట్టచ్చు.
బ్యాంకులు క్రెడిట్ కార్డు క్యాన్సిలేషన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చెయ్యచ్చు కూడా.
బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఫారం నింపి కూడా మీరు మీ క్రెడిట్ కార్డు ని కాన్సల్ చెయ్యచ్చు.

ఈ విషయాలను తప్పక తెలుసుకోండి:

క్రెడిట్ స్కోరు న్యూ క్రెడిట్, క్రెడిట్ అటిలైజేషన్, డ్యురేషన్ ఆఫ్ యువర్ క్రెడిట్ హిస్టరీ, అవుట్‌స్టాండింగ్ బ్యాలెన్స్, క్రెడిట్ మిక్స్ మీద ఆధార పడి వుంది. క్లోజ్ చేస్తే స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతుంది.
మీ దగ్గర ఎక్కివ క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు… వార్షిక రుసుము ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు అనిపిస్తే దాన్ని క్యాన్సల్ చేయడం మంచిది.
అలానే కార్డుని క్లోజ్ చేసేటప్పుడు అవుట్‌స్టాండింగ్ బ్యాలెన్స్‌ను క్లియర్ చెయ్యడం అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news