హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? అయితే వీటిని తప్పక చూడండి..!

-

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లుని కట్టుకోవాలని ఉంటుంది కానీ అంతమాత్రాన ప్రతి ఒక్కరు సొంత ఇల్లు కలని నిజం చేసుకోలేరు. కానీ హోమ్ లోన్ తీసుకోవడం ద్వారా సొంత ఇంటి కలని సాకారం చేసుకోవచ్చు. అయితే హోమ్ లోన్ ని మీరు కూడా తీసుకుని మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకోవాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా హోం లోని తీసుకునే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అలానే ఈ విషయాలను జాగ్రత్తగా ఫాలో అయితే సమస్యలు ఉండవు. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఎప్పుడైనా సరే హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే తక్కువ EMI ఉండేలా చూడండి. తక్కువ ఎలా పడుతుందో చూసి ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా ఈ ఈ విషయాలని అసలు మర్చిపోకూడదని నిపుణులు అంటున్నారు.
మీరు హోమ్ లోన్ తీసుకునే ముందు మీ యొక్క ఏరియా మరియు మీ ఇంటి గురించి వివరాలు తెలుసుకోవాలి.
బిల్డర్ గురించి తెలుసుకోవాలి.
స్థానిక నియమాలు గురించి మీకు అవగాహన ఉండాలి.
విశ్వసనీయ సంస్థ ద్వారా ఇంటిని కొనుగోలు చేస్తే మంచిది.
అలానే చౌక గృహ లోన్స్ కోసం పరిశీలించాలి. డాక్యుమెంట్లు అన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ.
అలానే ఆస్తి యొక్క వాస్తవ ధర గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వ రుసుముల గురించి రిజిస్ట్రేషన్ ఫీజు వంటి విషయాల గురించి కూడా తెలుసుకోవాలి ఇటువంటి విషయాలన్నిటినీ చక్కగా పరిశీలించాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలానే మీరు ప్రాపర్టీని కొనుగోలు చేసే ఖర్చు మాత్రమే కాకుండా ఇతర ఖర్చులు కూడా ఉండొచ్చు.
టాక్స్ బెనిఫిట్స్ ని కూడా మీరు తెలుసుకోవాలి మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసే వారికి టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ప్రిన్సిపల్ పై మినహాయింపు ఉంటుంది అలానే స్టాంప్ డ్యూటీ పై కూడా మినహాయింపు ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించండి.
అలానే మీరు ఇంటికి సంబంధించి నిర్ణయాలని వెంటనే తీసుకోకూడదు ఆఫర్ల గురించి ఎవరైనా చెప్తే మీరు వెంటనే టెంప్ట్ అవ్వద్దు. వీటిని జాగ్రత్తగా పరిశీలించి సమయం తీసుకు నిర్ణయం తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news