లవ్ & ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “నిన్నే చూస్తూ”…

-

వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్లో, శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి), హీరోహీరోయిన్లుగా,కే. గోవర్ధనరావు దర్శకత్వంలో, పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మించిన చిత్రం “నిన్నే చూస్తు”.రమణ్ రాథోడ్ అందించిన మ్యూజిక్ అందించారు.ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు, ఈ పాటలలోని రిధమ్స్ ,బీట్స్‌ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 27 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

 

కథ మరియు వివరణ 

సినిమా స్టార్ట్ అవ్వగానే అమలాపురం లో ఉండే కృష్ణ (శ్రీకాంత్ గుర్రం) తన తండ్రి బాను చందర్ ని చంపిన వారిని చంపడానికి బ్యాగ్ లో గన్ పెట్టుకొని ఇంట్లో తల్లి సుహాసినికి ఇంటర్వ్యూ కు పేరుతో బయటకు వెళ్లి తన తండ్రిని చంపిన వారిని వెతుకుతూ ఉంటాడు.చివరకు తన తండ్రిని చంపిన వ్యక్తి వైజాగ్ లో ఉన్నాడని తెలుసుకొని వైజాగ్ వెళ్లి చంపడానికి ట్రై చేస్తే అది మిస్ అవుతుంది. వైజాగ్ లోని ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్ జగదీశ్ చంద్ర ప్రసాద్ (సుమన్), ఇంద్ర (కిన్నెర) ల కూతురు సత్య (హేమలతా రెడ్డి/ బుజ్జి ) అమెరికా లో చదువుకుని ఇండియాకు తిరిగి వస్తుంది.తన తండ్రి దుబాయ్ కు వెళ్లడంతో తన ఫ్రెండ్ అయిన స్వాతి(ప్రెసిడెంట్ కూతురు)ని కలవడానికి అమలాపురం వస్తుంది సత్య .అదే ఊర్లో ఉండే కృష్ణ అప్పుడప్పుడూ తన డ్రీమ్ గర్ల్ తో పగటి కలలు కంటుంటాడు. అయితే ఒకరోజు కళ్ళు తెరవగానే నిజంగానే తన డ్రీమ్ గర్ల్ కనపడుతుంది. ఆ తరువాత సత్య తన ఫ్రెండ్ తో నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం ఈ విలేజ్ మొత్తం చూయించమని ఆడగడంతో ఆ అమ్మాయి కృష్ణ దగ్గరకు వచ్చి అమెరికా నుండి వచ్చిన తన ఫ్రెండ్ సత్య కు మన ఊరు చూయించమని హెల్ప్ అడుగుతుంది. అలా సత్య ను ఊరు చూపించే క్రమంలో ఒకరిని చూసుకొని డీప్ లవ్ లో పడతారు. దీనికి కృష్ణ అమ్మ కూడా ఒప్పు కుంటుంది.అయితే పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం వైజాగ్ రమ్మంటుంది సత్య, దాంతో వైజాగ్ వెళ్లిన కృష్ణ కు ఇంతకాలం తను చంపాలనుకున్న వ్యక్తి, ఎంతో ఇష్టంగా ప్రేమించిన సత్య తండ్రి జగదీశ్ చంద్ర ప్రసాద్ ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకొని వాళ్ళ అమ్మ, నాన్నలతో గొడవపడి వాళ్ళ నాన్న మీద కోపంతో సత్యతో నువ్వంటే ఇష్టం లేదు “ఐ హేట్ యు” అని చెప్పి వస్తాడు. దీంతో సత్య తల్లి ఇంద్ర (కిన్నెర) సొంత అన్న అయిన సాయాజి షిండే కొడుకు తో సత్యకు పెళ్లి ఫిక్స్ చేస్తారు. దీంతో అమెరికానుండి సత్యను పెళ్లి చేసుకోవడానికి ఇండియా వస్తాడు.అయితే జగదీశ్ చంద్ర ప్రసాద్ కృష్ణ నాన్న భానుచందర్ ను ఎందుకు చంపాడు? భానుచందర్ ను చంపిన జగదీశ్ చంద్ర ప్రసాద్ ను కృష్ణ చంపాడా లేదా ? కృష్ణ ను ఎంతో ఇష్టంగా ప్రేమించిన సత్య పెద్దల సమక్షంలో కృష్ణ ను పెళ్లి చేసుకుందా? లేక తల్లి, తండ్రులు కుదిర్చిన తన బావను పెళ్లి చేసుకుందా ? అనే విషయాలు తెలుసుకోవాలంటే కచ్చితంగా “నిన్నే చూస్తూ”.. సినిమా చూడాల్సిందే..

 

 

నటీ నటుల పనితీరు

శ్రీకాంత్ గుర్రం ఇటు అమ్మను ప్రేమగా చూసుకొనే కొడుకుగా అటు సత్య ను ప్రేమించే లవర్ గా, మరో వైపు తండ్రిని చంపిన వారిపై ప్రతీ కారం తీర్చుకోవాలనుకునే పలు షేడ్స్ వున్న పాత్రలలో చాలా చక్కగా నటిస్తూ పాత్రలో ఒదిగిపోయాడు. ఒక వైపు నిర్మాతగా మరో వైపు హీరోయిన్ గా నటించిన బుజ్జి(హేమలతా రెడ్డి) తన లుక్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లలో యూత్ ను ఆకట్టు కుంటుంది. స్క్రీన్ పై కృష్ణ, సత్య ల కెమిస్ట్రీ బాగా పండింది. వీరిద్దరి నటన చూస్తుంటే ఎన్నో సినిమాలు చేసిన యాక్టర్స్ లా చాలా అద్భుతంగా నటించారు. సత్య తల్లి, తండ్రులు గా సుమన్ కిన్నెర లు , కృష్ణ కు తల్లి, తండ్రులుగా సుహాసిని, బానుచందర్ లు, సుమన్ బావమరిదిగా సాయాజి షిండే ఇలా వీరందరి నటన చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. అలాగే ఇందులో వీరందరూ సెంటిమెంట్ పాత్రలను బాగా పండించారు. హీరో ఫ్రెండ్స్ గా జబర్దస్త్ మహేష్ తదితరులు నటించిన వారంతా తమ నటనతో ఆకట్టుకున్నారని అని చెప్పచ్చు.

సినిమాటోగ్రాఫర్ ఈదర ప్రసాద్, అందించిన విజువల్స్ బాగున్నాయి. లవ్ కు స్టార్స్ ఇవ్వకూడదు, ప్రేమను ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. నాగిరెడ్డి ఎడిటింగ్ పనితీరు బాగుంది. వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై పి.హేమలత రెడ్డి ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన నిన్నే చూస్తూ”..సినిమా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా చాలా చక్కగా తెరకెక్కించారు. మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అన్ని వ‌య‌స్సుల‌ వారిని కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.

సినీమా ప్లస్ పాయింట్స్ :

హీరో, హీరోయిన్ల నటన
కామెడీ
రొమాన్స్
సాంకేతిక అంశాలు
మ్యూజిక్
బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

ఏమి లేవు

 

రేటింగ్ 3/5

https://images.app.goo.gl/Dw7HR3PcGFaPCGeP9

Read more RELATED
Recommended to you

Latest news