తెలంగాణ ప్రజల ప్రోత్సాహం నాలో ఉత్సాహం నింపింది : రాహుల్‌ గాంధీ

-

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఈ యాత్రలో రాహుల్ వెంట వేలాది మంది కార్యకర్తలు నడిచారు. ఈ యాత్రలో భాగంగా రాహుల్ ప్రజలను కలిసి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రజల ప్రోత్సాహం తనలో ఉత్సాహాన్ని నింపిందని రాహుల్ గాంధీ అన్నారు. విద్వేషం చోడో.. భారత్ జోడో నినాదాలతో యాత్ర మార్మోగింది.

రైతులు, మత్స్యకారులు, బీడీ కార్మికులు, రైతు సంఘాలకు భరోసా కల్పిస్తూ రాహుల్ పాదయాత్ర కొనసాగింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాహుల్ ప్రసంగం భిన్నంగా సాగింది. అవినీతి టీఆర్ఎస్, మతతత్వ బీజేపీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

‘‘తెలంగాణ ప్రజలు ఇచ్చే ప్రోత్సాహం నాలో ఎంతో ఉత్సాహం నింపింది. ప్రజల ప్రేమ ఇలాగే ఉంటే ఇంకా ఎంత దూరమైనా నడుస్తా. టీఆర్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొంటున్నాయి. దేశంలోనే అత్యంత అవినీతి మయంగా టీఆర్ఎస్ సర్కార్‌ మారింది.’’ అని రాహుల్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news