శీతాకాలంలో ఎక్కడైకైనా ట్రిప్ వేయాలనుకుంటున్నారా…? అయితే సరస్సులను చూసొచ్చేయచ్చు..!

-

శీతాకాలంలో ఏదైనా ట్రిప్ వేయాలనుకుంటున్నారా..? కుటుంబ సభ్యులతో కలిసి కానీ స్నేహితులతో కానీ ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా..? నిజానికి ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనం చేసే పని నుండి బ్రేక్ దొరుకుతుంది.

అయితే మరి శీతాకాలం లో ఏదైనా ట్రిప్ వేయాలనుకుంటే ఈ సరస్సులను చూసి వచ్చేయండి. చాలా అద్భుతంగా మీరు ఇక్కడకి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. కుటుంబంతో వెళ్ళినా స్నేహితులతో వెళ్ళినా ఈ సరస్సులు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అయితే మరి వాటి వివరాల గురించి తెలుసుకుందాం.

కశ్మీర్ దాల్ లేక్:

కశ్మీర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. శ్రీనగర్‌లోని దాల్‌లేక్ చూసి వచ్చేయచ్చు. బోటింగ్ కూడా చెయ్యచ్చు. కనుక ఇక్కడకి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సమయంలో వెళ్తే ఎంతో బాగుంటుంది.

కేరళ వెంబనాడ్ లేక్

కేరళలోని వెంబనాడ్ లేక్ కూడా చూడాల్సిందే. సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో ఇది విస్తరించి వుంది. కేరళలోని టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ఇది మొదటి స్థానం లో వుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఇక్కడకి వెళ్ళచ్చు. మంచిగా ఎంజాయ్ చెయ్యచ్చు.

సిక్కిం సాంగో లేక్:

గ్యాంగ్‌టాక్‌కు సుమారు 40 కిలో మీటర్ల దూరంలో ఇది వుంది. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. రెండు హిమాలయాల నడుమ ఈ సరస్సు ఉంటుంది కనుక ఇక్కడకి అయినా సరే వెళ్ళచ్చు. నీళ్లు కూడా క్లియర్ గా బాగుంటాయి. ఇక్కడకి అయినా సరే ప్లాన్ చేసుకోవచ్చు

ఉదయ్‌పూర్ పిచోలా లేక్:

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో అందమైన సరస్సులు వున్నాయి. సుమారు 800 సంవత్సరాల క్రితమే నిర్మించారు. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఇక్కడకి వెళ్ళచ్చు. బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news