ఏ టపాసులు కాలిస్తే ఎంత కాలుష్యం వెలువడుతుందో తెలుసా?

-

దీపావళికి ఇంకా సమయం ఉంది.. కానీ అప్పుడే టపాసులు శబ్దాలు మారుమోగిపోతున్నాయి..ఎటువంటి వాటిని కొనాలి,ఎంతకు కొనాలి అని పిల్లలకి, పెద్దలకి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి..కొందమంది దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచే పటాకులు కాల్చడం ప్రారంభిస్తారు. కాగా కొన్ని క్రాకర్లు భయంకరమైన శబ్ధాన్నివ్వడంతోపాటు వాయు కాలుష్యాన్ని కలిగిస్తాయి.కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంటాయి.

 

 

 

 

 

కొన్ని రాష్ట్రాలు క్రాకర్స్ కాల్చడాన్ని నిషేధించాయి. కొన్ని రాష్ట్రాల్లో గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే కాల్చడానికి అనుమతినిచ్చారు. ఇటీవలికాలంలో గ్రీన్ క్రాకర్స్‌పై చాలామందిలో క్రేజ్ కనిపిస్తోంది. ఇప్పుడు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి? సంప్రదాయ పటాకులకు వీటికి తేడా ఏమిటో తెలుసుకుందాం. క్రాకర్లు కాల్చడం వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుంది. బాణసంచాలో సల్ఫర్ మూలకాలు ఉంటాయి. ఆక్సిడైజర్లు, రంగులు కూడా ఉంటాయి.

వీటినుండి రంగురంగుల కాంతి వెలువడుతుంది. ఇది యాంటిమోనీ సల్ఫైడ్, బేరియం నైట్రేట్, లిథియం, అల్యూమినియం, కాపర్, స్ట్రోంటియం మిశ్రమంతో ఏర్పడుతుంది. వాటిని కాల్చినప్పుడు అనేక రకాలైన రసాయనాలు గాలిలో కలుస్తాయి.

అవి గాలి నాణ్యతను దెబ్బతీస్తాయి. చలికాలంలో పొగమంచు కారణంగా గాలి నాణ్యత సూచిక ఇప్పటికే మరింత కనిష్టంగా మారింది. అటువంటి పరిస్థితిలో క్రాకర్లు కాల్చడం ద్వారా గాలి నాణ్యత మరింత దిగజారుతుంది. కాగా పటాకుల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని సూచించింది.

ఈ గ్రీన్ కలర్ టపాసుల వల్ల తక్కువ కాలుష్యం వెలువడుతుందని అధికారులు అంటున్నారు.. కాగా పటాకుల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని సూచించింది. గ్రీన్ క్రాకర్స్ వల్ల తక్కువ మోతాదులో కాలుష్యం వెలువడుతుంది. ఇవి సాధారణ పటాకుల కంటే 40 నుంచి 50 శాతం తక్కువ హానికరమైన వాయువును ఉత్పత్తి చేస్తాయి. అలాగే ఇవి సాధారణ బాణసంచా కంటే తక్కువ హానికరం.

గ్రీన్ క్రాకర్స్‌లో అల్యూమినియం, బేరియం, పొటాషియం నైట్రేట్, కార్బన్ ఉపయోగించరు. ఈ రకమైన విధానం కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ధ్వని కూడా తక్కువగా ఉంటుంది. గ్రీన్ పటాకులు గరిష్టంగా 110 నుండి 125 డెసిబుల్స్ మాత్రమే శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తుండగా, సాధారణ బాణసంచా 160 డెసిబుల్స్ వరకు శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తాయి..అయితే ఈ టపాసులు మామూలు వాటి కన్నా కూడా కాస్త ఖరీదు అయినవి..వీటిని ప్రభుత్వ దుకాణాల లో మాత్రమే కొనుగోలు చెయ్యాలి..

Read more RELATED
Recommended to you

Latest news