మంచి రాబడి పొందాలనుకుంటున్నారా..? అయితే ఇలా చెయ్యండి…!

మీరు మంచి రాబడి పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు బాగా ఉపయోగ పడుతుంది. రిటైర్మెంట్ అయ్యే సమయానికి మీరు కోటీశ్వరులు కావాలని అనుకుంటే మీకోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మ్యూచువల్ ఫండ్స్ ‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కోటీశ్వరులు అవ్వచ్చు.

డబ్బులు
డబ్బులు

అయితే ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ నుండి మంచి రాబడి పొందొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు కూడా దీని వలన మంచి రాబడి పొందొచ్చు అని అంటున్నారు. అందుకే మ్యూచువల్ ఫండ్స్ ‌లో సిప్ రూపం లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి సొంతం చేసుకోవచ్చు.

20 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి నెలకు రూ.1,581 ఇన్వెస్ట్ చేస్తే… రిటైర్మెంట్ కి అయ్యే సరికి 10 శాతం రాబడిని పరిగణలోకి తీసుకుంటే.. రూ.కోటి వస్తుంది. మీరు కనుక ప్రతీ ఏడాది సిప్ అమౌంట్‌ను 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళితే… 40 ఏళ్లకే కోటీశ్వరులు కావొచ్చు.

ప్రతి ఏడాది శాలరీ పెరుగుతూ ఉంటుంది. దానిని సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. 10 శాతం రాబడి ప్రకారం చూస్తే.. నెలకు రూ.13 వేలు ఇన్వెస్ట్ చేస్తే 40 ఏళ్లు వచ్చే సరికి కోటీశ్వరులు కావొచ్చు. అదే 15 శాతం రాబడి ప్రకారం చూస్తే నెలకు రూ.6,600 కట్టాలి. ఇలా మీరు మంచి రాబడి పొందుచు.