మైమరపించే నెల్లూరు మైపాడు బీచ్‌.. చూద్దాం పదండి..

-

మైపాడు నెల్లూరుకి దగ్గర్లో ఉన్న ఈ మైపాడు బీచ్‌ రాష్ట్రంలోనే చూడవలసిన బీచ్‌లలో ఒకటి.

పచ్చని వరిపొలాలు, కొబ్బరి తోటల పలకరింపులు..
పచ్చని వరిపొలాలు, కొబ్బరి తోటలు దారంతా పలకరిస్తాయి. మైపాడు పర్యాటక కేంద్రంలో విశాలమైన స్థలం, పిల్లలు ఆడుకోవడానికి సౌకర్యాలు ఏర్పటు చేశారు. తీరం పక్కనే శివాలయం ఉంది. ఆదివారాలు, సెలవులు పండుగ రోజుల్లో బోటు షికారు, సముద్ర ఇసుక తిన్నెల మీద హార్స్‌రైడింగ్‌ చేసేందుకు వీలుంటుంది.

సూర్యకిరణాలు పడి నీరు నీలం రంగులో..
మైపాడు బీచ్‌ నెల్లూరు నగరం నుంచి 25 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి ఇసుక బంగారు రంగులో చెణుక్కుమంటుంది. సూర్యకిరణాలు నీటిపై పడడంతో నీరు నీలంరంగులో కనిపిస్తాయి.

ఇసుక తిన్నెలు, పచ్చదనంతో ప్రశాంతమైన బీచ్‌..
బీచ్‌ అంతా ఇసుక తిన్నెలు, పచ్చదనంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. బీచ్‌ చుట్టుపక్కలవారంతా ఎక్కువ చేపలు పడుతుంటారు. పర్యాటకులు చేపలు పట్టుటకు మరియు సముద్రవిహారానికి అనువైన ప్రదేశంగా చెప్పవచ్చు.

అందంతో కూడిన బీచ్‌ ప్రాంతం..
బీచ్‌ ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది. అక్కడకు విచ్చేసిన పర్యాటకులను ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా పర్యాటకులు సముద్రంలో స్నానాలు చేసి సంతోషంగా గడుపుతారు. ఆదివారం నాడు ఉదయాన్నే వస్తారు. సాయంత్ర వరకూ అక్కడే గడిపి చీకటి పడగానే ఇంటికి చేరుకుంటారు.

ఏ కోనసీమలోనో, కేరళాలోనే విహరిస్తున్నట్లు..
నెల్లూరులోని మైపాడు బీచ్‌లో సేదతీరుతుంటే ఏ కోనసీమలోనే, కేళలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం ఆ అనుభూతినిస్తుందనడంలో అతిశయోక్తి లేనేలేదు.

బీచ్‌ ప్రాంతం పొడవు
బీచ్‌ ప్రాంతం చాలా పొడవుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో అనేక రిసార్ట్‌లు, హోటళ్లు ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా ప్రశాంతత నెలకొల్పడం వల్ల సాయంకాలం 6 వరకు తెరిచే ఉంటుంది. బీచ్‌లో సూర్యాస్తమయం చాలా బాగుంటుంది.

ప్రమాదం లేని అలలు
మైపాడు బీచ్‌లో వచ్చే అలలుతో అంత ప్రమాదం ఏమీ ఉండదు. అందుకే ప్రజలు ఎక్కువగా ఈ బీచ్‌నే ఎంచుకుంటారు. ప్రమాదం లేని అలలుతో ఆకర్షించే సాగరం మైపాడు సొంతం అని చెప్పవచ్చు. పిల్లలకు గుఱ్ఱపు స్వారీ కూడా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ వాటర్‌ స్పోర్ట్స్‌
ఆంధ్రప్రదేశ్‌లోని పార్యటక అభివృద్ధి సంస్థ వాటర్‌ స్పోర్ట్స్‌. రిసార్ట్స్‌ వంటి వాటిని అభివృద్ధి చేస్తుంది దీంతో వినోద కార్యకలాపాలను ఏర్పాటు చేయడం ద్వారా మైపాడు బీచ్‌ను ప్రోత్సహించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకుంటుంది.

పెంచలకోన జలపాతం
నెల్లూరులో మైపాడు బీచ్‌ ఒకటే కాదు నేలపట్టు పక్షి కేంద్రం కూడా ఫేమస్సే. ఉదయగిరి, వెంటకగిరి కోటలు, పెంచలకోన జలపాతం, కండలేరు డ్యామ్‌ అందాలు కూడా చూడాల్సిన ప్రాంతాలే. ఇవే కాదు నెల్లూరుకు దగ్గరలో చూడదగ్గవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో శ్రీహరికోట, పులికాట్‌ సరస్సును త్వరగా చూసిరావచ్చు.

ఎలా చేరుకోవాలి?
నెల్లూరు పట్టణానికి 25 కి.మీ. దూరంలో మైపాడు బీచ్‌ ఉంది. ఆర్టీసీ బస్సులు నేరుగా బీచ్‌ వరకూ వస్తాయి.
రోడ్‌ మార్గం : అన్ని ప్రధాన నగరాల నుంచి నెల్లూరుకు జాతీయ, రాష్ట్రీయ హైవే మార్గాలను చక్కగా అనుసందానించబడినవి. చెన్నై నుంచి 180 కి.మీ. దైరంలో నెల్లూరు ఉంది.
రైలు మార్గం : చెన్నై, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల నుంచి నేరుగా నెల్లూరు రైల్వేస్టేషన్‌ రెగ్యులర్‌ ట్రైన్స్‌ను అనుసందానించబడినది.
విమాన మార్గం : నెల్లూరుకు సమీప విమాన మార్గం చెన్నై :180 కి.మీ). ఈ ప్రధాన నగరం నుంచి డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌ సౌకర్యం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news