నాగచైతన్య “కస్టడీ” సినిమా షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

-

వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయింది. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. అలాగే, తెలుగు, తమిళ భాషల్లో మే 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news