ఓరి నాయనో.. ఇదేం పిచ్చి రా బాబు.. వీడియో చూస్తే నవ్వాగదు..

-

కొంతమందికి సినీ హీరోలంటే ఎనలేని అభిమానం ఉంటుంది..వారి సినిమాల నుంచి వాళ్లు చేసే ప్రతి కార్యక్రమాన్ని చూస్తుంటారు.. అసలు అంత ఎందుకు అనే ప్రశ్న వస్తే ఏమో తెలియదు అనే సమాధానం చెబుతున్నారు.. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఇప్పుడు ఓ వీరభిమాని తన హీరో స్వయంగా తన కళ్ల ముందుకు వస్తేనే పెళ్లి చేసుకుంటాను అని భీష్మించుకుర్చున్నాడు.. అతని ఇంట్లో నుంచి పెళ్లి కార్డు వరకు నందమూరి వారి ఫోటోలనే పెట్టాడు.. అది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

నందమూరి హీరో బాలయ్య వస్తేనే తాళి కడాతానంటున్నాడు పెళ్లి కొడుకు. ఆయనకే కాదు వాళ్ళకుటుంబం మొత్తానికి దేవుడు అంటే నందమూరి తారకరామారవునే. పూజా గదిలో ఆయన ఫోటోలే ఉంటాయని వాళ్ళు చెబుతున్నారు..ఒక ఎన్టీఆర్ నే కాకుండా ఆయన కుటుంబ సభ్యులనూ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. ఆ అభిమానాన్ని అంతటితో వదిలేయకుండా జీవితంలో ఒకసారి జరిగే పెళ్లి వేడుకలో కూడా వారికి స్థానం కల్పించడం అందరిని ఆకట్టుకుంది..

ఇక విషయానికొస్తే.. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామానికి చెందిన పులమరశెట్టి వెంకటరమణ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఆయన కుమారుడు పులమరశెట్టి కోమలీ పెద్దినాయుడుకి కూడా బాలయ్య అంటే పిచ్చి అభిమానం. ఇటీవల అతడికి పెళ్లి కుదిరింది. మార్చి 11న వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. పెళ్లి పిలుపు కోసం ముద్రించిన ఆరు పేజీల పెళ్లి పత్రికపై బాలయ్య, ఎన్టీఆర్ ఫోటోలను పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో అంటూ రాసుకొచ్చారు. బాలయ్య కు తెలిసిన పలువురును కలిసి అయనకు పెళ్లి గురించి సమాచారం ఇవ్వమని వేడుకున్నారు. కొంతమంది ఇచ్చాం అని చెప్పారని బాలయ్య వస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు ఆ కుటుంబ సభ్యులు. ఆహ్వానం అందుకుంటున్న అతిథులు దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు..నిజంగా పెళ్లికి బాలయ్య వస్తాడా లేదో అన్న ఆసక్తి జనాల్లో మొదలైంది.. ఏది ఏమైనా వారి ఆహ్వానం చూసిన వారంతా నవ్వుకుంటున్నారని తెలుస్తుంది.. ఆ పెళ్లికి బాలయ్య వస్తారో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news