సమంతతో విడాకులపై స్పందించిన నాగ చైతన్య.. ఇద్దరం హ్యపీగా ఉన్నామంటూ..

-

అక్కినేని నాగ చైతన్య.. సమంతల విడాకుల వ్యవహారం టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలో అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికి ఈ వ్యవహారంపై ఏదో ఒక చర్చ నెట్టింట్లో జరుగుతూనే ఉంది. అసలు వీరిద్దరి మధ్య ఏంజరిగింది, ఇంతగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని, అన్యోన్యంగా ఉన్న వీరిద్దరు ఎందుకు విడిపోయారనే దానిపై ఇప్పటికి ఎలాంటి న్యూస్ లేదు.

అయితే తాజాగా సమంతతో విడాకులపై తొలిసారిగా నాగ చైతన్య స్పందించారు. ఇద్దరు మంచి కోసమే మేం విడిపోయాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం అని వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరం హ్యాపీగా ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. ఈ సిచ్యువేషన్ లో ఇది ఇద్దరికి బెస్ట్ నిర్ణయమని ఆయన అన్నారు.

నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న ‘బంగాార్రాజు’ ప్రమోషన్  చేస్తోంది చిత్రయూనిట్. ఈ సమయంలో నాగ చైతన్యకు విడాకులపై ప్రశ్న ఎదురవగా స్పందించారు. బంగార్రాజు ఈనెల 14న సంక్రాంతి కానుకగా విడుదల అవనుంది. నాగ చైతన్యకు జోడీగా… కృతి శెట్టి నటిస్తోంది. ఆరేళ్ల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది.

Read more RELATED
Recommended to you

Latest news