నాగచైతన్యకు చాలా కాలం నుంచి ఆ సమస్య ఉందా?

-

అక్కినేని వారసుడు, యంగ్​ హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జోష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇటీవలే లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల ద్వారా మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. అంతలోనే ఆయన నటించిన థ్యాంక్యూ, లాల్​ సింగ్​ చడ్డా విడుదలై అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.

నాగ చైతన్య
నాగ చైతన్య

మరోవైపు హీరోయిన్ సమంతతో విడిపోయాక ఆయన శోభిత ధూళిపాళ్లతో రిలేషన్​లో ఉన్నారని ప్రచారం సాగింది. కానీ అలాంటిదేమీ లేదని చైతూ పీఆర్​ టీమ్​తో పాటు శోభిత కూడా ఇన్​డైరెక్ట్​గా చెప్పారు. దీంతో ఇద్దరిపై వస్తున్న వార్తలకు చెక్ పడినట్లు అయింది.

నాగ చైతన్య
నాగ చైతన్య

అయితే థ్యాంక్యూ సినిమాలో చైతూతో కలిసి నటించిన హీరోయిన్​ రాశీఖాన్నా… రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చైతూ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపినట్లు కథనాలు వచ్చాయి. ఆ కథనాల్లో.. చైతూ తాను సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటామని, ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంటామని రాశీ చెప్పింది.

నాగ చైతన్య
నాగ చైతన్య

ఇక చైతన్య వద్ద ఖరీదైన కార్లు ఉన్నాయని, అలాగే చైతన్యకు సైట్ ఉందనే విషయాన్ని బయట పెట్టింది. అందుకే చైతూ ఎంతో కాలం నుంచి అద్దాలను వాడుతున్నాడని తెలిపింది. కానీ చాలా మంది అది స్టైల్ కోసం ఆయన కళ్లజోడును వాడుతున్నారని అనుకుంటారని పేర్కొంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news