నాగచైతన్య థాంక్యూ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ లాక్..!!

-

నాగచైతన్య.. ప్రస్తుతం బంగార్రాజు , లవ్ స్టోరీ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతా లో వేసుకుని.. వరుస విజయాలతో దూకుడు మీద ఉండగా థాంక్యూ సినిమాతో బ్రేకులు పడిందని చెప్పవచ్చు. దిల్ రాజు నిర్మాణ సారథ్యం లో నాగచైతన్య హీరోగా రాశీఖన్నా హీరోయిన్ గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన థాంక్యూ సినిమా కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం. ఇక లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ థాంక్యూ టీజర్స్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ క్రమంలోనే జూలై 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

కానీ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక ఈ సినిమాలో ముఖ్యపాత్రలో మాళవికా నాయర్, అవికా గోర్ నటించగా,సంగీతం థమన్ అందించారు. ఈ సినిమాకు సంబంధించి ఓటిటి డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్, సన్ నెక్స్ట్ వాళ్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోని ఆగస్టు 12వ తేదీ నుంచి అమెజాన్ తో పాటు సన్ నెక్స్ట్ లో ప్రసారం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇంకా విడుదల కావాల్సి ఉంది.ఇకపోతే నాగచైతన్య వరుస సినిమాల విషయానికొస్తే.. మజిలీ ,లవ్ స్టోరీ , బంగార్రాజు వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. ఇక అంతకుముందు వచ్చిన వెంకీ మామ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. కానీ థాంక్యూ సినిమా మాత్రం డిజాస్టర్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ కోసం విక్రమ్ కే కుమార్తో కలిసి ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ధూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇక ఈ సిరీస్ మొత్తం మూడు సీజన్లుగా 30 ఎపిసోడ్లతో తెరకెక్కించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news