బర్మింగ్‌హామ్ వేదికగా.. కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ జట్టుకు రజత పతకం దక్కింది. మలేషియాతో జరిగిన ఫైనల్లో 1-3 తేడాతో ఇండియా ఓడిపోయింది. దీంతో ఇండియన్ జట్టు కేవలం సిల్వర్‌తో సరిపెట్టుకున్నది. భారత జట్టులో కేవలం పీవీ సింధు మాత్రమే మలేషియాతో జరిగిన మహిళల సింగిల్స్‌లో తన మ్యాచ్‌ను నెగ్గింది. ఇండియన్ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డిలు పోరాడు ఓడారు.
ఆ ఇద్దరూ టెంగ్ ఫాంగ్, వూయి ఇక్ చేతిలో 21-18, 21-15 స్కోర్‌తో ఓడిపోయారు. ఇక రెండవ మ్యాచ్‌లో పీవీ సింధు 22-20, 21-17 తేడా స్కోర్‌తో జిన్ వెయి గోపై విజయం సాధించింది. ఇక మూడవ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 19-21, 21-6, 16-21 స్కోర్‌తో నెగ్ తెజ్ యాంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ మ్యాచ్ గంటా ఆరు నిమిషాలు సాగింది. నాలుగవ మ్యాచ్‌లో ట్రెస్సా జాలీ, గాయత్రి గోపిచంద్ ఓడిపోయారు.