వైసీపీ పై జనసేన నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో నాగబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీని విమర్శించారు. వైసీపీ ఒక పార్టీనా….అరాచకం, దుర్మార్గం, ధౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ ఫైర్ అయ్యారు.
పొత్తులు ఎవరితో అనేది పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తారని.. పొత్తులు ఖరారు తరువాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయం జరుగుతుందని వెల్లడించారు నాగబాబు. వీరామహిళలు, జన సైనికులతో ముఖమాట్లాడి సమస్యలు తెలుసుకోవడానికి వచ్చా..గ్రామ స్థాయి నుంచి జన సైనికులు బలంగా వున్నారన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇంఛార్జీలను నియమించాలని కోరారు జనసేన నాగబాబు.