‘పోలవరం పూర్తిచేసి డ్యాన్స్ చేసుంటే ఇంకా బాగుండేది’ – అంబటికి నాగబాబు కౌంటర్

-

అంబటి రాంబాబు స్టెప్పులతో సందడి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు మొదలయ్యాయి. ఉదయం నుంచే పలువురు భోగిమంటలతో సంబరాలు చేసుకుంటున్నారు. ప్రముఖులు భోగి శుభాకాంక్షలు చెబుతున్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. బంజారా స్టెప్పులతో అదరగొట్టారు.

గత ఏడాది సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, అంబటి రాంబాబు స్టెప్పులపై మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు… పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది !అంటూ చురకలు అంటించారు నాగబాబు.

Read more RELATED
Recommended to you

Latest news