బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్… స్పందిస్తారా?

-

నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై గతంలో ఎవ్వరూ ఈ స్థాయిలో ఫైరయ్యి ఉండకపోవచ్చు. సినిమా ఇండస్ట్రీలోనే కానీ.. అటు రాజకీయాల్లోనే కానీ… బాలయ్యబాబుకు ఆస్థాయి వార్నింగ్ ఎవరూ ఇచ్చి ఉండకపోవచ్చు! ఆ సాహసం తాజాగా నాగబాబు చేశారు! సినీ పెద్దలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదని.. చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశానికి తనను ఎవరూ పిలవలేదని అసహనం వ్యక్తం చేస్తూ… హైదరాబాద్‌ లో అంతా కూర్చుని భూములు కానీ పంచుకుంటున్నారా? అని ఫైరయిన బాలయ్యపై నాగబాబు ఎవ్వరూ ఊహించన్ని విధంగా విరుచుకుపడ్డారు!

తనను ఎందుకు పిలవలేదు అనే విషయం క్లియర్ అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు కాన్నీ… భూములు పంచుకుంటున్నారంటూ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాదించాయన్ని మొదలుపెట్టిన నాగబాబు… నోటికి ఎంతవస్తే అంత మాట్లాడొద్దని, లేదు తాను అలానే మాట్లాడతాను అంటే అంతకు మించి పదిరెట్లు మాట్లాడటానికి ఇక్కడ చాల మంది సిద్ధంగా ఉన్నారని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు! నోరు కంట్రోల్ చేసుకుని మాట్లాడండి బాలకృష్ణ గారూ అంటూనే… భూములు పంచుకుంటున్నారనే విషయంలో చాలా చాలా తప్పుగా మాట్లాడారని… బాలయ్య తన మాటలతో ఇండస్ట్రీనే కాదు – తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానించారని అభిప్రాయపడ్డారు! ఈ సమయంలో బాలయ్య తన మాటలను వెనక్కి తీసుకోవాలని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు! ఈ రేంజ్ లో నాగబాబు ఇచ్చిన వార్నింగ్ కు బాలయ్య స్పందిస్తారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది!
`
కాగా… బాలయ్య వ్యాఖ్యలపై ఇనిర్మాత సి. కళ్యాణ్‌‌ వివరణ ఇస్తూ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా నాగబాబు సైతం బాలకృష్ణ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడటంతో టాలీవుడ్‌ లో కొత్త వివాదం తెరపైకి వచ్చినట్లేనని.. ఇది ఎంత దూరం వెళ్తుందనేది వేచి చూడాలని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news