ప్రస్తుతం టాలీవుడ్ లో బాలయ్య వర్సెస్ నాగబాబు అనే చర్చ తీవ్రంగా నడుస్తున్న సంగతి తెలిసిందే! బాలయ్య వర్సెస్ చిరు & కో కాస్తా… బాలయ్య వర్సెస్ నాగబాబుగా మారడానికి గల కారణం అందరికీ తెలిసిందే. తనను ఎవరూ ఏ మీటింగుకూ పిలవలేదు అని బాలయ్య అనడం, అనంతరం నాగబాబు ఫైరవ్వడమే దీనికి కారణం. ఈ క్రమంలో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుందా అనే సందేహం కలిగించే సంఘటనలు తెగ జరుగుతున్నాయి! ఈ విషయంలో బాలయ్య మళ్లీ ఆ ప్రస్థావన తెచ్చినట్లు లేదు కానీ… నాగబాబు మాత్రం.. తాజాగా ట్విట్టర్ వేదికగా “పిచ్చికుక్కల” ప్రస్థావన తీసుకొచ్చారు! ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!
అవును… సినీ నటుడు, జనసేన పార్టీ సీనియర్ నేత నాగబాబు తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. పిచ్చికుక్కలు ప్రమాదకరమంటూ మొదలుపెట్టిన ఆయన ట్వీట్ నెట్టింట సంచలనమవుతుంది. “ప్రజారోగ్య హెచ్చరిక” అంటూ మొదలుపెట్టిన నాగబాబు ట్వీట్ దాని సారాంశం ఏంటంటే.. “పిచ్చి కుక్కలతో వ్యవహారం ప్రమాదకరం. వాటిని బంధించాలి లేదా ఇంజెక్షన్ అయినా ఇవ్వాలి. కానీ వాటిపట్ల నిర్లక్ష్యం తగదు. ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు. అసలే ఇది పిచ్చికుక్కల కాలం” అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇప్పుడు నాగబాబు ట్వీట్ ఎవరి గురించి చేశాడంటూ సోషల్ మీడియా వేదికగా చర్చోపచర్చలు జరిగిపోతున్నాయి. ఇంత కాంట్రవర్సీ జరుగుతున్న టైములో నాగబాబుకు సడన్ గా ప్రజారోగ్యం గుర్తుకు రావడంపైనే అందరి అనుమానం! ఎందుకంటే సినీ ఇండస్ట్రీ పెద్దలు తనని పిలవకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంపై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించి బాలయ్యపై ఉగ్రరూపం ప్రదర్శించారు! ఏది ఏమైనా… ఇప్పటికే నాగబాబు – బాలయ్యల వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపుతుంటే తాజాగా నాగబాబు వేసిన “పిచ్చికుక్కల” ట్వీట్ ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందో వేచి చూడాలి!