మెగా బ్రదర్ నాగబాబు గురించి ఇండస్ట్రీలో పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. అయితే తన అన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాలలో స్టార్ హీరోలుగా కొనసాగుతుంటే.. తాను మాత్రం నిర్మాతగా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా తనను తాను నిరూపించుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే నిర్మాతగా ఈయన తెరకెక్కించిన ఆరెంజ్ సినిమా వల్ల పూర్తిగా నష్టపోయిన నాగబాబు..ఆ తర్వాత బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. సినిమాల ద్వారా కొంతవరకే అభిమానులు ఉన్న జబర్దస్త్ ద్వారా టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే నాగబాబుకు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి గుర్తింపు వచ్చింది జబర్దస్త్ ద్వారానే.
జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే కాకుండా జడ్జెస్ గా రోజా, నాగబాబు కెరియర్ కి కూడా అంతే ఉపయోగపడింది. అయితే చాలా కాలం పాటూ జబర్దస్త్ లో జడ్జిగా ఉన్న నాగబాబు పారితోషికం విషయంలో గొడవపడి మరి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత ఇతర ఛానల్స్ లో జబర్దస్త్ లాంటి కామెడీ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కానీ జబర్దస్త్ రేంజ్ లో ఆ షోలు హిట్ అవడం లేదు. అయితే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన నాగబాబు మళ్ళీ తిరిగి జబర్దస్త్ లోకి వెళ్తారా అనే ప్రశ్న ఎదురైనప్పుడు జబర్దస్త్ తో తనకు ఎలాంటి గొడవ లేదు అని, మల్లెమాల వాళ్లకు కొంతమంది కమెడియన్స్ కి ఇబ్బందులు వచ్చినప్పుడు వారికోసం నేను బయటకు వచ్చేసాను అంటూ తెలిపాడు. అంతేకాదు మళ్లీ మల్లెమాల వాళ్లు పిలిచి అవకాశం ఇస్తే తప్పకుండా వెళ్లి జబర్దస్త్ జడ్జ్ గా చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.
అయితే ఇప్పుడేమో జబర్దస్త్ లోకి నాగబాబు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నాగబాబును నమ్ముకొని జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయిన చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీల పరిస్థితి ఏంటి? అని ప్రస్తుతం సినీ ప్రేక్షకుల సైతం తమ అభిప్రాయాలను ప్రశ్నలు రూపంలో కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఎవరు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.