సమంత ఆరోగ్యంపై డాక్టర్ల కీలక ప్రకటన..అవి వదులుకోవాల్సిందే !

-

తన అనారోగ్యం గురించి..తాజాగా నటి సమంత ఓపెన్ అయ్యింది. మయోసిటిస్‌ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆరోగ్యం నిలకడగానే ఉందని.. త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. చేతికి సెలైన్‌‌ ఎక్కుతుండగా.. యశోద సినిమాకు డబ్బింగ్ చెబుతూ ఆమె ఈ పోస్ట్ చేసింది.

దీంతో సమంత కోలుకోవాలని కోరిన వారిలో టాలీవుడ్ స్టార్స్ నాని, తారక్, బండ్ల గణేష్, తమన్ వంటి వారు ఉన్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా సమంత ఆరోగ్యంపై వైద్యులు కీలక ప్రకటన చేసినట్లు సమాచారం అందుతోంది. సమంత ఎక్కువగా ఒత్తిడికి లోనైతే.. ప్రమాదం ఉంటుందని.. అందుకే ఆమె ప్రతీ విషయాన్ని చాలా ప్రశాంతంగా తీసుకోవాలని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news