నాగచైతన్య “దూత” మూవీ రిలీజ్ డేట్ లాక్ !

-

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ దూత. చై తన కెరీర్ లో నటిస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. కాగా గత రెండు సంవత్సరాలుగా ఈ వెబ్ సిరీస్ గురించి వినిపిస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం వెబ్ సిరీస్ టీం శుభవార్తనే అభిమానులకు అందచేసింది అని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేశారు. దూత వెబ్ సిరీస్ డిసెంబర్ ఒకటవ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్ లుగా తెరకెక్కగా, ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నిముషాలు ఉండనుంది. కాగా దూతను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని శరత్ మరార్ రూ. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.

ఇక ఇందులో నాగచైతన్య తో పాటుగా పార్వతీ తిరువొతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి నాగ చైతన్య కెరీర్ లో నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ హిట్ అవుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news