నాగాలాండ్ ఘటనపై పార్లమెంట్లో ప్రకటన చేయనున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా..

-

నాగాలాండ్ ఘటనపై  ఈరోజు పార్లమెంట్ దద్దరిల్లే అవకాశం ఉంది. నిన్న నాగాలాండ్ లో జవాన్ల ఫైరింగ్లో  14 మంది అమాయకపు పౌరులు చనిపోయారు. ఉగ్రవాదులుగా భావించిన జవాన్లు ట్రక్కుపై కాల్పులు జరిపారు. బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు వెళ్తుండగా మోన్​ జిల్లాలోని ఓటింగ్ వద్ద ఈ కాల్పులు జరిగాయి. కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తున్నారు. అయితే, మిలిటెంట్ల కదలికలున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టిన బలగాలు.. కాల్పులు జరిపాయి. అయితే, కాల్పుల్లో పౌరులే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. దీంతో కోపోద్రిక్తులపైన ప్రజలు ఆర్మీపై దాడులు చేశారు. పలు షాపులకు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై హత్యానేరం కేసులు కూడా పెట్టారు.

ఈ ఘటనపై కాంగ్రెస్, త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఫైరయ్యాయి. దీంతో ఈరోజు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇదే ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. దీంతో ఈ రోజు పార్లమెంట్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం పార్లమెంటులోని రెండు సభల్లో షా మాట్లాడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మొదట లోక్​సభలో తర్వాత రాజ్యసభలో ఈ ఘటనపై అమిత్ షా ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news