సూపర్ స్టార్ కృష్ణ ఆఖరిచూపుకు నోచుకొని నాగార్జున… అసలు కారణమిదే!

-

సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం యావత్తు సినీలోకాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఇక బుధవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. సినీ ప్రముఖులందరూ ఆయ పార్థివ దేహానికి నివాళులు అర్పించి… కన్నీటి వీడ్కోలు పలికారు. కానీ అక్కినేని నాగార్జున మాత్రం కృష్ణ గారిని చివరి చూపు చూసేందుకు రాలేదు. ఇది ప్రస్తుతం ఆయనపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

అక్కినేని అభిమానులు సైతం నాగార్జున ఇలా చెయ్యడంపై సోషల్ మీడియాలో తప్పుబడుతున్నారు. ముఖ్యమంత్రులే పనులు మానుకొని మరీ కృష్ణ గారి భౌతిక కాయాన్ని దర్శించుకొని నివాళులు అర్పిస్తుంటే మీరు హాజరుకాకపోవడానికి కారణం ఏంటని ట్విటర్​లో నాగార్జునను ట్యాగ్ చేస్తున్నారు. చాలా మంది నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.అయితే నాగార్జున ప్రస్తుతం గోవాలో ఉన్నందునే రాలేకపోయారని తెలుస్తుంది. వందల కోట్లు ఖర్చు చేసి సినిమాలను నిర్మిస్తున్న వారే నేడు షూటింగ్స్ ని బంద్ చేసి స్వచ్చందంగా కృష్ణ గారికి నివాళులు అర్పిస్తున్నారు.

అలాంటిది నాగార్జున గారికి కృష్ణ గారికి అత్యంత సన్నిహితుడు అయ్యినప్పటికీ కూడా చివరి చూపు చూసేందుకు రాకపోవడంపై అందరూ తప్పుపడుతున్నారు.అక్కినేని కుటుంబంతో కృష్ణకు మంచి సంబంధాలు ఉన్నాయి. శోభన్ బాబు తర్వాత కృష్ణ అత్యధిక మల్టీస్టారర్​ సినిమాలు చేసింది అక్కినేని నాగేశ్వర రావు గారితోనే. వీళ్లిద్దరి కాంబినేషన్​లో బంగారు బాబు, కుల గోత్రాలు, శాంతి నివాసం, అక్క చెల్లెలు, మంచి కుటుంబం, గురు శిష్యులు, ఊరంతా సంక్రాంతి, హేమాహేమీలు, రాజకీయ చదరంగం ఇలా 9 సినిమాల్లో కలిసి నటించారు. అలా వీళ్లిద్దరు మధ్య మంచి సన్నిహిత్య సంబంధం ఉంది.

కృష్ణ గారు హీరోగా మంచి స్టార్ స్టేటస్​తో కొనసాగుతున్న సమయంలోనే నాగార్జున హీరోగా నటించిన వారసుడు సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నాగార్జున కృష్ణ గారి చొక్కా కాలర్ పట్టుకున్నందుకు అప్పట్లో కృష్ణ గారి అభిమానులు నాగార్జున పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

అప్పట్లో ఈ వివాదం పెద్ద దుమారం రేపింది. స్వయంగా నాగార్జున రంగంలోకి దిగి అభిమానులకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి కృష్ణకి నాగార్జున గారికి పెద్ద మాటలు లేవు. అది మనసులో పెట్టుకొని నాగార్జున గారు కృష్ణ గారి చివరి చూపు చూడడానికి ఇష్టపడేలేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కృష్ణ ఆఖరిచూపుకు నాగార్జున రాకపోవడంపై తీవ్ర దూమారం చెలరేగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news