సీఎం రేవంత్ రెడ్డికి నాగార్జున విషెస్…!

-

తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత ఉత్కంఠ జరిగిందో తెలిసిందే. కేసీఆర్ అధికార బలాన్ని చూపించినా చివరికి ప్రజలు తిరస్కరించారు. తద్వారా కాంగ్రెస్ ను గెలిపించి అధికారంలోకి తెచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి తరపున రేవంత్ రెడ్డిని బలంగా నమ్మిన అధిష్టానం అతన్ని సీఎంగా నియమించి చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రోజు ఎంతో ఘనంగా జరిగిన ప్రమాణస్వీకారం లో రేవంత్ రెడ్డి సీఎంగా అయ్యాడు.. సీఎం తో పాటుగా కొంతమంది మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన సందర్భంలో ఇతనికి పలువురు అన్ని పరిశ్రమల నుండి శుభాకాంక్షలు తెలియచేశారు. ఇక ప్రముఖ సినీ నటుడు నిర్మాత అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియచేశారు.

మీ నాయకత్వంలో రాష్ట్రము మరింతగా అభివృద్ధి చెందాలి అంటూ అల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఇంకా బాగుపడాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news