గరిష్ఠ స్థాయికి చేరువలో నాగార్జునసాగర్‌

-

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహంతో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. జలాశయ నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరువలో ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే గేట్లు ఎత్తివేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు.

ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ఆదివారం సాయంత్రానికి పూర్తిస్థాయి మట్టానికి మరో 19 అడుగుల దూరంలో ఉంది. జలాశయం గరిష్ఠ నిల్వ మట్టం 590 అడుగులకుగాను 572.50 అడుగుల నీటి మట్టం ఉంది. నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను 261.84 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి 1,56,766 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

మరోవైపు శ్రీశైలానికి జూరాల నుంచి 44 వేలు, తుంగభద్ర నుంచి 98 వేల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. శ్రీశైలం జలాశయం వద్ద 1.52 లక్షల ఇన్‌ఫ్లో నమోదు అవుతుండగా గేట్లు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 1.71 లక్షల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. గోదావరి పరీవాహకంలో కొంతమేరకు ప్రవాహం తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news