టీకాంగ్రెస్‌కు షాక్.. నందికంటి శ్రీధర్ రాజీనామా

-

మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరికతో నందికంటి శ్రీధర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని శ్రీధర్ రంగం సిద్దం చేసుకున్నారు. అయితే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో శ్రీధర్ కాంగ్రెస్ ను వీడారు. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ స్థానాలను మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ ను వీడుతున్నట్టుగా ప్రకటించారు. సోమవారంనాడు కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు పంపారు.

ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను ఉల్లంఘిస్తూ మైనంపల్లి ఫ్యామిలీకి మెదక్, మల్కాజిగిరి టికెట్ ఇస్తున్నారని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా, మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరడంతో నందికంటి శ్రీధర్ పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది. దీంతో అలర్టైన కాంగ్రెస్.. ఆయనతో చర్చలు జరిపింది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ సైతం ఆఫర్ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుజ్జగించినా శ్రీధర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేసినా నమ్మకుండా శ్రీధర్ పార్టీకి రాజీనామా చేయడం ఎన్నికల వేళ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన నందికంటి శ్రీధర్.. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news