టక్ జగదీష్ మోషన్ పోస్టర్: టక్ వేసుకుని రంగంలోకి దిగిన నాని..

Join Our Community
follow manalokam on social media

నేచురల్ స్టార్ నాని నుండి టక్ జగదీష్ సినిమా వస్తుందన్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని సినిమా వెండితెర మీదకి రాలేదు. మధ్యలో వి సినిమా ఓటీటీలో రిలీజైనప్పటికీ చాలా మందికి ఆ వచ్చిందన్నట్లు గుర్తే లేదు. ఎంతైనా థియేటర్లలో సినిమా విడుదలైతే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికా అన్నట్టు టక్ జగదీష్ వచ్చేస్తుంది. తాజాగా టక్ జగదీష్ మోషన్ పోస్టర్ రిలీజైంది. చేతిలో గడ్డపార పట్టుకుని విలన్లని చితకబాదుతున్నట్టు కనిపిస్తున్న పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

హీరో, విలన్ల మధ్య గొడవ జరుగుతుంటే హీరోనే గెలుస్తాడని ఎదురుచూసే ప్రేక్షకుల్లా అటు పక్కన జనం నిలబడి ఉన్నారు. ఐతే ఫైట్ జరుగుతున్నప్పటికీ నాని టక్ చేసుకునే ఉండడం కీ పాయింట్ లా కనిపిస్తుంది. మొత్తానికి ఇంతకుముందు చూడని కొత్త నానిని ఈ సినిమా ద్వారా చూడబోతున్నట్లు తెలుస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా చేస్తుంది.

TOP STORIES

EPF: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్… వివరాలు ఇవే…!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది జీతం ఉన్న వ్యక్తుల కోసం ప్రభుత్వ యాజమాన్యం తో నడిచే పెన్షన్ ప్లాన్. దీంతో ప్రతి నెల 12...