ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పలు నియోజవర్గాల ఇంచార్జ్‌లు.. నారా బ్రాహ్మణిని కలిశారు. చంద్రబాబు అరెస్టు ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ, ఎవరూ చూడలేదన్నారు నారా బ్రాహ్మణి. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు, రిపోర్టులు తాను పరిశీలించానని….చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా ఎక్కడా లేదని అన్నారు నారా బ్రాహ్మణి. రాజకీయ కక్ష తప్ప ఈ కేసు మరొకటి కాదని అభిప్రాయపడ్డారు. ఈ స్థాయి విధ్వేష రాజకీయాలు ఎప్పుడూ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలన్నారు బ్రాహ్మణి.
ఈ స్థాయి విద్వేష రాజకీయాలు ఎప్పుడూ లేవని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని… గంజాయి, డ్రగ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. తెలుగుదేశం, జనసేన.. రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటుపై లోకేశ్ చర్చిస్తున్నారని తనను కలిసిన జనసేన నేతలకు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలన్నారు. స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపిన జనసేన నేతలకు, అండగా నిలబడుతున్న పార్టీ కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.