మెజార్టీ సీట్లు సాధిస్తే పవనే సీఎం : నాగబాబు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులు, గతంలో టీడీపీతో ఎదురైన అనుభవాలను పార్టీ కార్యకర్తలతో పంచుకున్న నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తులో భాగంగా అత్యధిక స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తే పవన్ కల్యాణ్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు జనసేన పార్టీ కిందనే టీడీపీ పనిచేయాల్సి ఉంటుందంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు తమను వేధించారని నాగబాబు ఎదుట పలువురు జనసైనికులు ప్రస్తావించారు.

Naga Babu Konidela: వైసీపీ అటాక్ కు నాగబాబు కౌంటర్- మగముత్తైదువులకు  వాయినాలివ్వండి.. | mega brother nagababu strong counter to ysrcp ministers'  remarks on pawan kalyan - Telugu Oneindia

బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే టీడీపీ, జనసేన పొత్తుపై చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు పార్టీల క్యాడర్ మధ్య కూడా అసంతృప్తులు బయటపడుతున్నాయి. మొన్నటి వరకు టీడీపీతోనే జనసేన పొత్తు కుదరదనే అభిప్రాయాలు కనిపించాయి. బీజేపీతో తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ తరుచూ చెప్పేవారు. అయితే.. టీడీపీని కూడా తమతో పొత్తులోకి తీసుకోవడానికి పని చేస్తామన్న పవన్ కళ్యాణ్ ఏకంగా టీడీపీతో కలిసి వెళ్లుతామని ప్రకటించడం సంచలనమైంది. బీజేపీ నుంచి ఇంకా ఈ అంశంపై స్పష్టత లేదు.