జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన‌ నారా లోకేశ్..

-

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ వస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ జగన్ కు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి పుట్టిన రోజు జరుపుకుంటున్న జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు.

- Advertisement -

‘ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు. కాగా, ఇప్ప‌టికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, తమిళనాడు మునిసిపల్ మంత్రి వేలుస్వామి, 15వ ఆర్ధిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, జార్ఖండ్ ఎంపీ అన్నపూర్ణాదేవి తదితరులు సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...