ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యాడు మాజీ మంత్రి నారా లోకేష్. తమ పార్టీ నేతలను తప్పుడు కేసులు నమోదు చేసి సీఐడీ కేసులు పెట్టి మరీ హింసిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్ భారత రాజ్యాంగానికి బదులుగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఇక తన ట్విటర్ ఖాతాలో ప్రభుత్వాన్ని నిలదీస్తు తన మామ బాలకృష్ణ సింహా సినిమాలోని డైలాగ్ల స్టైల్ లో ట్వీట్ చేశారు.
వైఎస్సార్‌సీపీ మాఫియా ఇసుక కొట్టేస్తే నో సీఐడీ.. ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సీఐడీ.. ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సీఐడీ.. విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సీఐడీ.. 108లో స్కామ్ బయటపడితే నో సీఐడీ.. మైన్స్ మింగేస్తుంటే నో సీఐడీ.. మహిళల పై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడుతుంటే నో సీఐడీ అంటూ బాలయ్య రేంజ్‌లో డైలాగ్స్ తో ట్వీట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో లోకేష్ చేసిన ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
మహిళల పై అత్యాచారాలు,వేధింపులకు పాల్పడుతుంటే నో సిఐడి. రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ని సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్ గా మార్చేసారు @ysjagan గారు.భావ ప్రకటనా స్వేచ్ఛ ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?(2/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 23, 2020