గురజాల ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్లో పడుకుంటారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తే రాళ్లు వేయిస్తున్నారు.. బాంబులకే భయపడని కుటుంబం రాళ్లకు భయపడుతుందా? అని ప్రశ్నించారు.
“రాళ్లేస్తే పారిపోవడానికి మాది బులుగు జెండా కాదు బ్రదర్ దమ్మున్న పసుపు జెండా. రాళ్లేస్తాం, ఫ్లెక్సీలు చించుతాం అంటూ ఎవడైనా వస్తే నెక్ట్స్ బర్త్ డే ఉండదు” అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు. పబ్జీ జగన్ ఇంట్లో దొంగలు పడ్డారని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆ వార్త వినగానే తనకు మూడు డౌట్లు వచ్చాయని వెల్లడించారు. “మొదటి డౌట్… సీఎం ఇంట్లో దొంగలు ఎలా పడ్డారు? రెండో డౌట్… దొంగలు పడినప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు? మూడో డౌట్… దొంగ ఇంట్లో దొంగలు ఎలా పడ్డారు? దొంగ ఇంట్లో దొంగలు పడ్డారు అని తేలిపోయింది. సీఎం డిజిటల్ సైన్ ఉపయోగించి 225 ఫైళ్లు సెటిల్మెంట్ చేశారు. ఆయనకు తెలియకుండా ఫైల్స్ క్లియర్ అవుతున్నాయి. కోట్లు చేతులు మారాయి. ఆ టైంలో జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా? పబ్జీ ఆడుకుంటున్నాడా అని అన్నారు.